మా అభ్యర్థిపై దాడి చేసి మా పైనే కేసులు పెడుతున్నారు అని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.. అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని డాక్టర్ పెమ్మసాని తెలిపారు.
ఫేక్ పోస్టింగులతో టీడీపీ తలపట్టుకుంటుంది. టీడీపీని.. ఆ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ఫేక్ పోస్టింగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ - జనసేన మధ్య గ్యాప్ పెంచేలా పోస్టింగులు ఉండడంతో టీడీపీ ఆందోళన చెందుతుంది. జనసేనకు 63 స్థానాలు ఇచ్చామంటూ ఇటీవలే అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ పోస్టింగులు చేశారు. అంతేకాకుండా.. పవన్ ను విమర్శిస్తున్నట్టు బుద్దా వెంకన్న పేరుతో ఫేక్ పోస్టింగులు పెట్టారు. కాగా.. కేశినేని నానినే తనపై ఫేక్ పోస్టింగులు పెట్టారని బుద్దా…
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. టీవీ డిబేట్ లో కొలికపూడి నా తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు.. నన్ను చంపటానికి లైవ్ లో డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఇచ్చారు అంటూ ఆయన ఆరోపించారు. కొలికపూడి అదే మాట మూడుసార్లు అన్నారు.. కొలికపూడి ముందే కుమ్మక్కై ఇలా మాట్లాడారు.. అతని వ్యాఖ్యల వల్ల వేరే వాళ్లు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది..
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. వివస్త్రని చేసి గోళ్ళతో రక్కి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ వద్ద ఉన్న బంగారు నగలును అపహరించారు.
Digvijay Singh: మధ్యప్రదేశ్ ఎన్నికల పోరులో కాంగ్రెస్, బీజేపీల మధ్య వాగ్వాదం పెరిగింది. బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ బాజ్‌పాయ్‌పై సమాచార, సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి, సంఘ సేవకురాలిగా సుధామూర్తికి చాలా మంచి గుర్తింపు ఉంది. అంత ఆస్తి ఉండి కూడా సింపుల్ గా ఉండే ఆమె తీరుకు అందరూ ఫిదా అయిపోతూ ఉంటారు. అంతేకాదు ఆమె మంచి ఇన్ ఫ్లూయన్సర్ కూడా. తన మాటలతో ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఆమె ఎక్కడైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే దీనినే కొంతమంది ప్రజలను…
Volunteers Police Complaint Against Pawan Kalyan: ఏపీలో అధికారమే లక్ష్యంగా పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రెండో విడత వారాహి యాత్ర చేస్తున్న ఆయన ఒక పక్క అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాడు. వాలంటీర్ వ్యవస్థ మానవ అక్రమ రవాణాకు తోడ్పడుతుందని…
గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్ఐ రవితేజపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఆమె ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన కాంప్లైంట్ లో పేర్కొంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపింది.