సైబర్ నేరగాళ్ళు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. మీకు లాటరీ తగిలిందని, మీకు కారు బహమతిగా వచ్చిందని, గిఫ్ట్ కూపన్స్ వచ్చాయని వినియోగదారుల్ని బుట్టలో వేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్ళు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేరుతో ఫేక్ నంబర్ తో వాట్సప్ చాట్ చేసి 1.4 లక్షలకు టోకరా వేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు వైద్యాధికారి ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ( డీఎంహెచ్ఓ ) డాక్టర్ కోటాచలంకి నిన్న జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఫొటోతో ఉన్న 9368435819 నంబర్ నుండి వాట్సప్ మెసేజ్ వచ్చింది.
Read Also: Green India Challange : గ్రీన్ఇండియా చాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన రమేష్ రెడ్డి
మొదటగా యోగ క్షేమాలు అడిగినట్టు నటించి తాను కాన్ఫరెన్స్ మీటింగ్ తో బిజీ గా ఉన్నా. అర్జంట్ గా అమెజాన్ గిఫ్ట్ కూపన్స్ పంపించేది ఉంది తాను తరవాత నగదు పంపిస్తాను అని చెప్పడంతో నిజంగానే కలెక్టర్ అడిగారని భ్రమపడిన డీఎంహెచ్ఓ కోటా చలం వెంటనే రూ.1.40 లక్షల విలువ గల గిఫ్ట్ కూపన్స్ కోసం కేటుగాళ్ళు చెప్పిన నంబర్ కి డబ్బులు పంపించారు. అయినప్పటికీ ఇంకా కూపన్స్ సరిపోలేదు.
తాను బయటకు వచ్చే పరిస్థితి లేనందున ఇంకా 1.20 లక్షలు పంపించాలని అడగడంతో లేటుగా అనుమానించిన కోటా చలం కలెక్టర్ సీసీ కి ఫోన్ చేసి సదరు నంబరుని పోల్చి చూడగా అది కలెక్టర్ గారి నంబర్ కాదని తేలింది. తాను మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు . ఒక వైపు వివిధ రూపాల్లో సైబర్ నెరగాళ్ళు బురిడీ కొట్టించే అవకాశం ఉందని అలెర్ట్ గా ఉండాలని సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు ఇప్పుడు అధికారులకు సైతం అవగాహన సదస్సులు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
Read Also: T20 World Cup: ముగిసిన పాక్ ఇన్నింగ్స్.. భారత్ ముందు 160 లక్ష్యం