చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ పేరుతో వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ తాజాగా ఒక అనూహ్య సంఘటనతో వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక వీఎఫ్ఎక్స్ డేటా మరియు ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఘటనకు కారణమైన చరిత అనే మహిళపై…
టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటన సినీ వర్గాల్లో సంచలనంగా మారడంతో పాటు, చిత్ర బృందానికి ఊహించని ఎదురుదెబ్బగా నిలిచింది. Also Read:Unni Mukundan…
'వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..' ఈ మాటలు ఏదో సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది కదూ.. కానీ ఈ డైలాగ్ వెనక ఉన్న పూర్తి విషయం తెలిస్తే అవాక్కవుతారు. పెళ్లికి ముందు అత్త, అల్లుడు ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని మద్రక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అల్లుడు తన పెళ్లికి ముందే తన కాబోయే అత్తగారితో పారిపోయాడు. ఈ సంఘటన…
భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా, అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గళ్లా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
HP: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని HP పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజల్ పంపుల్లో గమనించిన మోసంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజల్ పంపుల నుంచి ఇంధనం రాకపోయినా పరికరంలో చూపించే మీటర్ తిరుగుతూ అమౌంట్ చూపిస్తూ ఉంది. పెట్రోల్, డీజల్ ధరను వాస్తవానికి తగినంత చూపించకుండానే అమౌంట్ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వాహనదారులు ఈ మోసాన్ని గమనించి పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అయితే, సిబ్బంది దీనిని ఒక “టెక్నికల్ ప్రాబ్లమ్”…
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తుతెలియని వారు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచుమనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు
పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై చేస్తున్న ట్రోలింగ్స్‌పై తాను వెళ్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. వైఎస్ జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తింటున్నాయన్నారు.
Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ మేరకు పలువురు బీజేపీ నేతలపై ఈరోజు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అలాగే, ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ పంపారు.
Cyber Frauds: గత కొంతకాలంగా అనేక చోట్ల ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతు కోట్ల రూపాయలు కోళ్లగొడుతున్నాయి ముఠాలు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి చెందిన కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. ఈ ముఠాల కోసం ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సైబర్ క్రైమ్ పోలీసుల బృందాలు వెళ్లాయి. సైబర్ ముఠాలకు అకౌంట్స్ సప్లయ్ చేస్తున్న వారితో పాటు అకౌంట్ హోల్డర్లలను సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. Kishan…