మెస్ట్ కామన్ గా.. భర్తలపై భార్యలు పోలీసులకు కంప్టైంట్స్ ఇస్తారు. అయితే గత కొద్దీ కాలంగా ట్రెండ్ కాస్త మారుతూ వస్తోంది. భార్యల చేతులో ఇబ్బందులు పడుతున్న భర్తలు క్రమంగా బయటకు వస్తున్నారు. భార్య హింస పెడుతుందంటూ.. తనని పట్టించుకోవడం లేదంటూ పోలీసులను భర్తలు ఆశ్రయిస్తున్నారు. అంతే కాదు భర్త కూడా గృహహింస బాధితులుగా మారిపోతున్న సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. తన భార్యపై ఓ భర్త పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అది చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. తర్వాత భర్త చెప్పిన విషయాలకు పోలీసులు షాక్ అయ్యారు.
Also Read : Russia-Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే.. పుతిన్ గద్దె దిగాల్సిందే..
బెంగళూరులోని బసవగూడకు చెందిన కమ్రాన్ ఖాన్ కు కొన్నాళ్ల క్రితం ఆయేషా అనే యువతితో పెళ్లైంది. అయితే మ్యారేజ్ జరిగినప్పటి నుంచి తన భార్య ఎక్కువ టైం నిద్రపోతూరు ఉంటుందని కమ్రాన్ పేర్కొన్నాడు.
రాత్రి నిద్రపోతే మధ్యాహ్నం 12.30గంటల వరకు నిద్రపోతుందని వాపోయాడు. ఒకవేళ నిద్రలేపాలని చేస్తే తిరిగి తిడుతూందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవేళ మధ్యాహ్నం పడుకుంటే రాత్రి 9: 30 గంటల వరకు నిద్రపోతునే ఉంటుందని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఇలా ఎక్కువ సేపు నిద్రపోయే వాళ్లు పెళ్లి చేసుకోవడం దేనికంటూ ప్రశ్నించాడు.
Also Read : MLC Kavitha : రేపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశం
తన భార్య ఏ పనీ చేయదని.. అంతా తన తల్లి చేస్తుందని కమ్రాన్ ఖాన్ ఆరోపించాడు. పని చేయమంటే చిరాకు పడటం.. తిట్టడం లాంటివి చేస్తుందని బాధితుడు వాపోయాడు. వయసు మీద పడ్డ తన తల్లిని కూడా సరిగా చూసుకోవడం లేదని.. తన తల్లే తనకు వండిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇప్పటి వరకు వీటన్నింటిని భరించామని.. ఈ మధ్య తమ కుటుంబ సభ్యులపై దాడి చేయడం ప్రారంభించిందన్నాడు. తన భార్యను భరించడం తనకు, తన కుటుంబ సభ్యులకు భారంగా మారిందని.. అందుకే పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు కమ్రాన్ ఖాన్ తెలిపాడు. తన భార్యతో పాటు మామ ఆరిఫుల్లా, అత్త హీనా కౌసర్ లపై బసవగుడి పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also Read : Serial Kisser : సీరియల్ కిస్సర్.. మహిళలే వాడి టార్గెట్..