కోట్ల రూపాయల అప్పులకు ఐపీ పెట్టి ఓ వస్త్ర వ్యాపారి కుటుంబం పరారైన ఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో కలకలం రేపింది. తీర్థ యాత్రలకు వెళ్లిన వస్త్ర వ్యాపారి కుటుంబం పది రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతోపాటు సెల్ ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 60 సంవత్సరాల క్రితం గ్రామానికి వలస వచ్చిన మల్లూరి ఆదినారాయణ తన వ్యాపారాన్ని వస్త్ర మూటల ద్వారా మొదలుపెట్టారు.
Read Also: Bhatti Vikramarka: కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు.. ఆమె ఇచ్చారు
కాలక్రమేణా వస్త్ర దుకాణం ఏర్పాటు చేసుకుని తన ముగ్గురు కుమారులకు అప్పగించారు.. రెండవ కుమారుని కొడుకు మల్లూరి రమేష్ తన తాత ఆదినారాయణ పేరు మీద గత 20 సంవత్సరాలుగా వస్త్ర దుకాణం నిర్వహిస్తూ ప్రజలలో విశ్వాసం సంపాదించాడు… విశ్వాసమే పెట్టుబడిగా గ్రామస్తులు నుండి సుమారు 40 కోట్ల రూపాయల మేర అప్పులు చేసి వ్యాపారం నిర్వహిస్తుండగా కొందరు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టు పట్టడంతో తన ఆస్తులను అమ్మి సుమారు 17 కోట్ల రూపాయల అప్పులు తీర్చినట్లు సమాచారం.
మిగిలిన వారికి సంక్రాంతి పండుగ వ్యాపారం అనంతరం డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పి… 10 కోట్ల రూపాయలతో ఈ నెల నాలుగవ తేదీన కుటుంబంతో సహా తిరుపతి వెళుతున్నట్లు గ్రామంలో నమ్మబలికి ఉడాయించినట్లు సమాచారం… దీంతో బాధితులు అవాక్కయ్యారు. వస్త్ర వ్యాపారి రమేష్ 40 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.. రమేష్ కుటుంభాన్ని పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ పెదపూడి పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు రమేష్ కుటుంబం తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి రాలేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పెదపూడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Rashmika Mandanna: ఐదేళ్లలో ఐదు లగ్జరీ ప్లాట్స్ కొన్న రష్మిక..?