హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. వివస్త్రని చేసి గోళ్ళతో రక్కి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ వద్ద ఉన్న బంగారు నగలును అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహిత భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె ఎక్కడ తలదాచుకోవాలో తెలియక యూసుఫ్ గూడ బస్టాప్ లో పడుకుంది. అయితే వివాహిత దగ్గరకు చేరుకున్న ఇద్దరు కిలేడీలు.. మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆమె దగ్గర ఉన్న నగలను కొట్టేయాలనే ప్లాన్ తో కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అంతటితో ఆగారా లేదు.. అదేం పిచ్చి కానీ, అసహజ శృంగారానికి పాల్పడ్డారు.
Read Also: Tirumala: కాసేపట్లో తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
ఆ తర్వాత వివాహిత మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు, చెవిదిద్దులను లాక్కున్నారు ఇద్దరు మహిళలు. ఆ తర్వాత మత్తు నుంచి బయటపడ్డ వివాహిత.. వారి చెర నుంచి తప్పించుకుని వచ్చి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై వారిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ ఉండే కల్లు కంపౌండ్ అడ్డాగా ఇద్దరు మహిళలు పలు నేరాలకు పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న మహిళలను చూసి బంగారం, నగదు కొట్టేయడం చేస్తున్నారు.
Read Also: Road Accident: తమిళనాడులో రోడ్ టెర్రర్.. లారీ-సుమో ఢీ, 7 మంది మృతి