Sudhamurthy: ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి, సంఘ సేవకురాలిగా సుధామూర్తికి చాలా మంచి గుర్తింపు ఉంది. అంత ఆస్తి ఉండి కూడా సింపుల్ గా ఉండే ఆమె తీరుకు అందరూ ఫిదా అయిపోతూ ఉంటారు. అంతేకాదు ఆమె మంచి ఇన్ ఫ్లూయన్సర్ కూడా. తన మాటలతో ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఆమె ఎక్కడైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే దీనినే కొంతమంది ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. సుధామూర్తి వివిధ కార్యక్రమాలకు హాజరు అవుతానని చెప్పకపోయినా ఆమె వస్తుందంటూ డబ్బులు వసూలుల చేశారు. ఈ విషయం తెలుసుకున్న సుధామూర్తి పోలీసులను ఆశ్రయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తన పేరు దుర్వినియోగ పరుస్తున్నారంటూ కంప్లైట్ ఇచ్చారు.
Also Read: PM Mudra Loan: తక్కువ వడ్డీకి, ష్యూరిటీ లేకుండా బిజినెస్ కోసం రూ. 10 లక్షల లోన్ కావాలా?
Also Read
- Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
- PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
- Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
వివరాల్లోకి వెళ్తే.. తమ సంస్థ 50వ వార్షికోత్సవానికి హాజరుకావాలంటూ కన్నడకూట నార్తన్ కాలిఫోర్నియా (కేకేఎన్‌సీ) వారు ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆమె కార్యాలయానికి ఇమెయిల్ పంపించి ఆహ్వానించారు. అయితే ఆమెకు ఆ సమయంలో ఖాళీ లేకపోవడంతో రాలేనని తెలిపారు. సుధా మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయం సుధా మూర్తి దృష్టికి వచ్చింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సుధామూర్తి కేకేఎన్‌సీ నిర్వాహకులను సంప్రదించగా తాను సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి లావణ్య అనే మహిళ ఇదంతా చేసిందని వారు సుధా మూర్తికి తెలిపారు.
ఇక మరో ఘటనలో కూడా కొంత మంది సుధామూర్తి పేరును దుర్వినియోగం చేశారు. సుధా మూర్తి USAలో ఒక కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొంటూ శ్రుతి అనే మహళ కార్యక్రమానికి హాజరు కావాలనుకుంటున్న వారి నుంచి ఒక్కొక్కరకి 40 డాలర్ల చొప్పున వసూలు చేసింది. సెప్టెంబర్ 26న ‘డాక్టర్ సుధా మూర్తితో మీట్-అండ్-గ్రీట్’ అనే కార్యక్రమం నిర్వహిస్తు్న్నట్లు ప్రకటనలు చేశారు. ఇది సుధా మూర్తి కంటపడటంతో ఇక వీరిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సుధామూర్తి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌తో పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. బెంగళూరు జయనగర్ పోలీసులకు ఆమె కంప్లైట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419, 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66(సి), 66(డి) కింద కేసు నమోదు చేశారు. ఇక సుధామూర్తి పేరు చెప్పి మోసాలకు దిగిన మహిళలు ఇండియాలో ఉన్నారా? లేదా అమెరికాలో ఉన్నారా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నాయి ఖాకీలు.
తాజావార్తలు
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?