Volunteers Police Complaint Against Pawan Kalyan: ఏపీలో అధికారమే లక్ష్యంగా పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రెండో విడత వారాహి యాత్ర చేస్తున్న ఆయన ఒక పక్క అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాడు. వాలంటీర్ వ్యవస్థ మానవ అక్రమ రవాణాకు తోడ్పడుతుందని పవన్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తమకు అప్పచెప్పిన 50 ఇళ్లలో ఎవరెవరు ఉన్నారు? వారు ఏయే పార్టీలకి మద్దతుగా ఉన్నారు? అమ్మాయిలు ఉన్నారా? ఉంటే వివాహం అయిందా? అవకపోతే ప్రేమికులు ఉన్నారా? లాంటి వివరాలన్నీ నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వాలంటీర్లు సేకరిస్తున్న పబ్లిక్ డేటాతో మిస్ యూజ్ అవుతుందని ఆయన ఆరోపించారు.
Harish Shankar: మొన్న నితిన్ గడ్కరీ.. ఇప్పుడు తరుణ్ ఛుగ్.. బీజేపీ లీడర్స్ తో హరీష్ ముచ్చట్లేంటి?
ఇదే విషయమై ఆయన నేరుగా చేస్తున్న ఆరోపణలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. పవన్ వ్యాఖ్యల మీద ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు రోడ్డెక్కి పవన్ దిష్టిబొమ్మలు సైతం దగ్ధం చేశారు. ఇక వైసీపీ నేతలు సైతం పవన్ మీద పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ పై పోలీస్ కేసు పెట్టడం చర్చనీయాంశం అయింది. విజయవాడకు చెందిన సురేష్ అనే వాలంటీర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పవన్ పై పోలీస్ కేసు పెట్టాడు. వారాహి యాత్రలో ఉన్న పవన్ వాలంటీర్లపై చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేష్, అదే విషయమై పోలీసులను ఆశ్రయించారు. ఇక పోలీసులు పవన్ కల్యాణ్‌పై ఐపీసీ 153, 153ఏ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ ఇప్పుడు జరగాల్సి ఉంది. వాలంటీర్ సిస్టమ్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడమే కాదు పెను సంచలనానికి కూడా దారి తీశాయి.