సాధారణంగా భర్తలు తప్పు చేస్తే భార్యలు వారిని చీల్చి చెండాడతారు. ఇక వేరే అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నాడని తెలిస్తే అంతే సంగతులు. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతడిని కొట్టి పోలీసులకు అప్పగించిన భార్యల గురించి చాలాసార్లు విన్నాం. అయితే ఇక్కడ ఒక భార్య తన భర్త వేరే అమ్మాయి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఏ భార్య చేయని పని చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. భోపాల్…
అవసరానికి అక్కరకు వస్తుందని బంగారాన్ని తాకట్టుపెడితే ఆ బంగారాన్ని కాజేశాడో బ్యాంక్ మేనేజర్. ఐఐఎఫ్ ఎల్ బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని మాయం చేశాడా మేనేజర్. క్రికెట్ బెట్టింగ్ కోసం పెద్ద మొత్తంలో పందెం కాశాడు మేనేజర్ రాజ్ కుమార్. తమ బ్యాంకులో తనఖా పెట్టిన 14.5 కిలోల బంగారాన్ని మాయం చేశాడు రాజ్ కుమార్. వన్ స్టార్ బెట్ యాప్ లో రాజ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ కాశాడు. కోట్ల రూపాయల బెట్టింగ్ కి పాల్పడ్డ…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీనేతలు మండిపడుతూనే వున్నారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు చేశారు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోవడంతో ధర్నా, ఆందోళనలకు దిగింది. ఇవాళ పోలీస్ కమిషనరేట్ల ముందు, ఎస్పీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు చేయనుంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయనందుకు నిరసనగా పోలీస్ కమీషనరేట్స్…
విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో జరిగిన దారుణ హత్య కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య కళ్ళ ఎదుటే భర్తను నాటు తుపాకీతో కాల్చి అనంతరం కత్తితో పొడిచి చంపారు ప్రత్యర్ధులు. కిటుముల పంచాయతీ పరిధిలోని బూసిబంద గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. బూసిబంద గ్రామానికి చెందిన పాంగి సుమంత్ (50) తన భార్య రస్సు తో కలిసి పెదబయలు చుట్టాల ఇంటికి వెళ్లి శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో…
కంప్యూటర్ యుగం.. ప్రపంచం మొత్తం డిజిటల్ గా దూసుకుపోతుంది. కానీ ఎక్కడో ఒకచోట మూఢ నమ్మకాలను నమ్మే వారు మాత్రం ఇంకా లగే ఉంటున్నారు. వీరి వలనే దొంగ బాబాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజగా ఒక మహిళ తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకొంది. ముగ్గురు ఆడపిల్లలు.. నాలుగోసారి కూడా ఆడబిడ్డ పుడితే పుట్టింటికి పంపించేస్తానన్న భర్త.. దీంతో ఆమె కాలు నిలవలేదు. గర్భం దాల్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన, భయం. ఎక్కడ తన భర్త తనను వదిలేస్తాడో…
ఎన్నో ఆశలతో ప్రతి యువతి పెళ్లి చేసుకొంటుంది. భర్త, అత్తమామలు తోడుగా ఉంటారని, తన కుటుంబాన్ని వదిలి వస్తోంది. కానీ, అక్కడకి వచ్చాక భర్త, అత్తమామల వికృత రూపం బయటపడితే.. కట్నం కోసం చిత్రహింసలు పెడితే.. ఆ వేధింపులు తట్టుకోలేని వారు కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. మరికొందరు అలాంటివారిని పోలీసులకు అప్పజెప్పి జైలుకు పంపిస్తారు . తాజాగా మధ్యప్రదేశ్ లోని ఒక మహిళ భర్త వికృత చేష్టలను భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, అత్తమామల…
అనుమానం పెనుభూతంగా మారింది. ఒక చిన్న అనుమానం ఒక వ్యక్తి ప్రాణం తీసేవరకు వచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుణకు సమీపంలోని లాడ్‌పుర్ గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వారింటికి కొంతమంది వ్యక్తలు వచ్చి అతడిని బయటికి లాకొచ్చారు. తమ వద్ద కాజేసిన ఫోన్ ఇవ్వాల్సిందిగా అరుస్తూ అతడిని చితకబాదారు. తనకేమి తెలియదని అరవింద్ చెప్తున్నా వినకుండా అతడి బట్టలను విప్పి, అతని చేతులు…
రాజకీయాలు అన్నాకా వివాదాలు రాకుండా ఉండవు. ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. తాజాగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ బీజేపీ ఎమ్మెల్యేనే అంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కర్ణాటకలో సంచలనంగా మారింది. అయితే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ మాత్రం ఇందులో ఏ నిజం లేదని ఆమె నా మీద ఘాటు ఆరోపణలు చేస్తుందని తెలుపుతున్నారు.…
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ సరయుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సరయు అందులో బోల్డ్ వర్డ్స్, బోల్డ్ కంటెంట్ తో బాగా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక గతేడాది చివర్లో సరయు స్నేహితురాలు రాజన్న సిరిసిల్ల లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసింది. ఆ రెస్టారెంట్ ప్రమోషన్ వీడియోలో సరయు తన అందచందాలతో ఆడిపాడింది. అయితే ఆ వీడియోలో గణపతి…
ప్రస్తుతం సమాజంలో చాలామందికి ప్రాణం విలువ తెలియడంలేదు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడి నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షా ఫెయిల్ అయ్యానని ఇలా చిన్నచిన్నవాటికే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువతి తల్లిదండ్రులు తిట్టారనే అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నెక్కొండ రజక వాడకు చెందిన అమృత, చెల్లెలు అంజలి, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా అమృత అదే గ్రామానికి…