ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని ఒక బార్ లో తప్ప తాగి ఒక లేడి సింగర్ పై లైంగిక దాడికి పాల్పడిన అతడిపై కేసు నమోదు చేసి హవాయి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎజ్రా మిల్లర్ ఇటీవల హవాయిలోని ‘హిలోలో బార్’లో పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఒక యువతి కరావోకే సాంగ్స్ పాడుతుండగా.. మిల్లర్ స్టేజిపైకి ఎక్కి ఆమెతో అసభ్య పదజాలంతో ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమె ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అతడిని అడ్డుకోవడానికి వచ్చిన బార్ మేనేజర్ పై దాడికి ప్రయత్నించాడు. అంతేకాకుండా అతడికి ఎదురుతిరిగిన ఆ యువతి మైక్రోఫోన్ లాక్కొని ఆమెను బూతులు తిడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. దీంతో బార్ యాజమాన్యం మిల్లర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు మిల్లర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాంటివి ఇకముందు చేయకుండా 500 డాలర్లు జరిమానా విధించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. వరుస సినిమాలతో హిట్లు అందుకుంటున్న యువహీరో ఇలా చేయడం చాలా బాధాకరమని అతడి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.