సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్స్ 2022 ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఒక అపశృతి చోటుచేసుకోవడం, అది కాస్తా ప్రస్తుతం హాట్ తొలిపిక్ గా మారడం జరిగిపోయింది. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్యపై యాంకర్ క్రిస్ జోకులు వేయడం.. దానికి హార్ట్ అయిన విల్ స్మిత్ వేదికపై అతగాడి చెంప చెళ్లుమనిపించడం.. ఈ హఠాత్ పరిణామానికి అక్కడున్న వారందరు షాక్ కి గురి అవ్వడం చకచకా జరిగిపోయాయి.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తరువాత విల్ స్మిత్ కోపం తగ్గాక క్రిస్ కి సారీ చెప్పడంతో ఈ గొడవ ముగిసిపోయింది. అయితే ఈ ఘటనపై లాస్ ఏంజిల్స్ పోలీసులు తమదైన వాదనను వినిపించారు. అందరు చూస్తుండగా విల్ స్మిత్ అలా కొట్టడం తప్పు అని, ఒక వేళ క్రిస్ తనపై చేయి చేసుకున్నందుకు ఫిర్యాదు చేస్తే విల్ స్మిత్ ని అరెస్ట్ చేసేవారమని, కానీ క్రిస్ ఫిర్యాదు చేయకపోవడంతో తాము ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని తెలిపారు. అంతేకాకుండా ఎప్పుడైనా క్రిస్, విల్ స్మిత్ మీద ఫిర్యాదు చేయాలనుకుంటే తామెప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఇష్యూ నెట్టింట వైరల్ గా మారింది.