వైయస్సార్ కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా? అని ప్రశ్నించారు. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతిన కొట్టారని ఆరోపించారు. ఆ పోలీసులకు టీడీపీ నాయకులు జీతాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తాము అతన్ని పోలీసుగా కాకుండా రౌడీగా పరిగణిస్తామన్నారు. మీ పరిధి దాటి మీరు రౌడీగా ప్రవర్తిస్తే మేము సహించాలా..? అని ప్రశ్నించారు. తాజాగా కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
READ MORE: Alla Ramakrishna Reddy: నేను నారా లోకేష్‌పై గెలిచాను.. అందుకే ఈ తప్పుడు కేసులు..!
తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. “మొన్న యువకులను నడిరోడ్డుపై ఇష్టారీతిన కొట్టారు. కొందరు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు. రేపు వైఎస్సార్సీపీ గెలిచాక ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది..? మహానాడులో వైఎస్సార్సీపీ వాళ్లకు తడిసిపోతుంది అంటున్నారు. మాకు కాదు తడిసిపోయేది..మీ కార్యకర్తలకు తడిసిపోతుంది. రేపు ప్రభుత్వం మారి పోతే నువ్వు సింగపూర్ పారిపోతారు. మీరు మగాళ్ళైతే రేపు మీరు అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో ఉండండి. రేపు మీ టీడీపీ వారి ప్రాణాలకు మీరు రక్షణగా ఉంటారా..? ఇది తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబు కూడా వైఎస్సార్సీపీ వారికి ఏ పథకం ఇవ్వొద్దు అంటున్నారు. మీరు తెస్తున్న ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది?
గతంలో నేను టీడీపీలో ఉండి మీటింగు పెడితే ఒక కల్యాణ మండపం కూడా నిండదు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి వస్తారు.. అది బలుపు కాదు వాపు. నువ్వు కడపలో పెట్టీ మాట్లాడాలంటే నువ్వు రద్దు చేసిన మెడికల్ సీట్ల గురించి చెప్పాలి. మెడికల్ కాలేజ్ లను ప్రైవేట్ పరం చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నావు.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Jatadhara : ఆయన కేవలం సూపర్ స్టార్ కాదు.. దేవుడు
GNSS, HNSS లింక్ కాలేటి వాగు పనులు ఎందుకు పూర్తికాలేదు..? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. “ఏంటి తడిసిపోయేది లోకేష్… ఏమి చేయగలవ్.. అరెస్ట్ చేయించి కొట్టిస్తావు అంతేగా.. ఆ తర్వాత నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకో..నీ కార్యకర్తల పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో.. మీరు, ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీ నుంచి మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మీరు భయపడితే ఇక్కడ ఎవరు భయపడరు.. ఈ ఏడాది కాలంలో నువ్వు చేసింది పింఛన్ పెంపు మాత్రమే. అదీ ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు. గ్యాస్ లబ్ది ఏ ఊరికి వెళ్ళైనా అడుగుదాం.. సగానికి పైగా అందలేదు. నువ్వు ఎంతమందిని జైల్లో వేయగలవు లోకేష్..? అమరావతిలో పనులు 20శాతం లెస్ కి చేస్తా…నాకు ఇస్తావా..? లక్ష కోట్లు ఒక్క రాజధానికి పెట్టడం సమంజసమా..? నువ్వు తీసుకునే లక్ష కోట్లా అప్పు అమరావతి వాళ్లే కడతారా..? శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ ఆ అప్పు కట్టాలి. ఎన్టీఆర్ కంటే మహానాడులో జగన్ నామ స్మరణ మాత్రమే చేశారు. జగన్ బయటకు వెళితే జనం రాకతో రోడ్లు పట్టడం లేదు.. అదే జగన్ అంటే.. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. మేము కూడా జైలు బరో చేస్తాం. నీకు, నీ కొడుకుకి వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్లుంది. ప్రభుత్వం మారితే విదేశాలు వెళ్తాం అనుకుంటున్నారేమో…కుదరదు. అసలు ఎవడు నువ్వు..? ఏ అధికారంతో మాపై అక్రమ కేసులు పెడతావా..?జెండాలు పీకితే హత్యాయత్నం కేసులు పెడతావా..? పర్యవసానం అనుభవించక తప్పదు..” అని సతీష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.