జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్‌కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలను ప్రభుత్వ కుట్రలో భాగమేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
READ MORE: Hyderabad: నేడే హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. విజయం ఎవరిది?
దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశదోహ్రం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత వెల్లడించారు. బీఎన్ఎస్ 152/196/197(1)/113(3)/352/353 సెక్షన్లు కింద కేసు నమోదైంది. మరోవైపు.. అమినుల్ వ్యాఖ్యలపై ఏఐయూడీఎఫ్ పార్టీ స్పందించింది. ఇతను చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ వ్యాఖ్య తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చింది. పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతూ మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు.
READ MORE: Pawan Kalyan : ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇది