విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఓవైపు గోదావరి ముంచెత్తుతుంటే.. అదే ముంపులో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.. అల్లూరి జిల్లా విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితుల ఆందోళనలు హోరెత్తుతున్నాయి..నిన్న చింతూరు వరద నీటిలో ధర్నాకు దిగిన నిర్వాసితులు.. తాజాగా ఈ రోజు వి.ఆర్.పురంలో వద్ద భారీగా ఉన్న వరద నీటిలో ఆందోళన చేపట్టారు.. విలీన మండలాల్లో ప్రతి సంవత్సరం సంభవించే వరదలకు తాము అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకునే నాథుడే కారువయ్యాడని ఇక్కడి నిర్వాసితులు లబోదిబోమంటున్నారు.…
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో 1986 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో గోదావరికి వరదలు వచ్చాయని.. నిన్ననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని.. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండాలని ముందు రాలేదని సీఎం చెప్పారని గుర్తుచేశారు.. ఇక, 3.60 లక్షల మందిని పునరావాస కేంద్రాల్లో ఉంచాం, ఇప్పటికీ సహాయక చర్యలు…