పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తిచేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లాంఘనలకు రూ. 120 కోట్లు పర్యావరణ జరిమానా చెల్లించాలన్న ఎన్ జి టి తీర్పు ను సుప్రీం కోర్ట్ లో సవాలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ కేసుపై విచారణ జరిపింది జస్టిస్ అజయ్ రాస్తోగి ధర్మాసనం. పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతల ప్రాజెక్టులపై NGT ఇచ్చిన తీర్పుపై దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కలిపి వింటామని సుప్రీం కోర్టు పేర్కొంది. పర్యావరణానికి కలిగిన నష్టాన్ని ఎందుకు బాధ్యత వహించరని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
Read Also: Rajasthan Political Crisis: కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల చిచ్చు.. హైకమాండ్ ముందు మూడు షరతులు
ఇప్పటికి కూడా ఉల్లంఘనలు జరుగుతున్నాయని కోర్టుకు వివరించారు పిటిషనరు. పోలవరం ప్రాజెక్టు (polavaram project) వల్ల యాభై వేల మంది ముంపునకు గురయ్యారని వివరించారు పిటిషనర్ పెంటపాటి పుల్లారావు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన మూడు పిటిషన్ల పై విచారణను వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
గతంలోనాలుగు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన పర్యావరణ ఉల్లంఘనలకు గాను ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధించింది “నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్” ( ఎన్.జి.టి). అవేంటో చూద్దాం..
• పోలవరం ప్రాజెక్టు కు రూ. 120 కోట్లు ఎన్.జి.టి జరిమానా.
• పట్టిసీమ ప్రాజెక్టు కు రూ. 24. 9 కోట్లు ఎన్.జి.టి జరిమానా.
• పురుషోత్తంపట్నం ప్రాజెక్టు కు రూ. 24.56 కోట్లు ఎన్.జి.టి జరిమానా.
• చింతలపూడి ప్రాజెక్టు కు రూ. 73.6 కోట్లు ఎన్.జి.టి జరిమానా.
Read Also: Suriya 42: అది మా రక్తం.. ఎవరైనా అలా చేస్తే జైలుకే పంపిస్తాం