రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సర్వ సాధారణమైన విషయం.. కొన్ని సార్లు.. ప్రత్యర్థులకు రాజకీయ నేతలు కొత్త కొత్త పేర్లు నామకరణం చేస్తుంటారు.. వారు చేసే కామెంట్లను బట్టి.. ఫన్నీగా.. సెటైర్లు వేసేలా పేర్లు పెడుతుంటారు.. ఇప్పుడు.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కొత్త పేరు పెట్టారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్నినాని.. ఇవాళ మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు.. చంద్రబాబుకు సరిపోయే పేరు ‘నారా గజిని’ అని ఎద్దేవా చేశారు.. 1996లోనూ ఇదే రకంగా వరద వచ్చి ఊర్లు మునిగిపోయాయి.. కానీ, అప్పుడు పోలవరం లేదుగా? అని ప్రశ్నించారు. మరి చంద్రబాబు బకెట్, చీపిరి, చాట పట్టుకుని ఇల్లిల్లూ కడిగాడా?? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన జీవిత కాలంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చాడా?? అని నిలదీసిన ఆయన.. హుదూద్, తిత్లీ తుఫాన్లలో జీవోలు తప్పా… బాధితులకు చంద్రబాబు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. తిత్లీ తుఫానులో చంద్రబాబు హెలికాప్టర్, ఏసీ బస్సు మినహా ట్రాక్టర్ ఎందుకు ఎక్కలేదు?? అని ప్రశ్నించారు. హుదూద్, తిత్లీ తుఫాన్లలో జారీ చేసిన జీవోలకు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధితులకు డబ్బులు చెల్లించారని గుర్తుచేశారు పేర్నినాని.
Read Also: Adhir Ranjan Chowdhury: ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు
వరద బురదలోనూ రాజకీయాలు వెతికే వ్యతక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్నినాని.. వరద ప్రాంతాల్లో పర్యటనలో ఒక్క ఓదార్పు మాటైనా మాట్లాడావా చంద్రబాబు..? అని ప్రశ్నించారు.. అధికారం ఇస్తే పోలవరం ముంపు ప్రాంతాలన్నింటినీ ఒక జిల్లా చేస్తావా..?మరి 2014-19 వరకు అధికారంలో ఉండగా ఆ పని ఎందుకు చేయలేకపోయావు..? ఇప్పుడే చంద్రబాబుకి ముంపు ప్రాంతాలు గుర్తుకు వచ్చాయా..? 13 ఏళ్లు సీఎంగా, 13 ఏళ్లు ప్రతిపక్ష నేతగా.. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో పోలవరం ముంపు ప్రాంతమైన ఎటపాక ఎప్పుడైనా వెళ్లావా..? అంటూ ఫైర్ అయ్యారు. వరద బాధితుల పట్ల చంద్రబాబువన్నీ ముసలి కన్నీరేనని కొట్టిపారేసిన ఆయన.. అధికారంలో ఉండగా వారం వారం పోలవరం వెళ్లావు కదా అప్పుడైనా ఎటపాక వెళ్లావా..? 1996లోనూ ఎటపాక వరదకు మునిగిపోయింది కదా..? అప్పుడు సీఎంగా ఎందుకు చంద్రబాబు వెళ్లలేదు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు పేర్నినాని.