ఏపీ తెలంగాణ మధ్య ఈమధ్య పోలవరం, భద్రాచలం రచ్చ రాజేసింది. ఈనేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ (jaganmohan reddy) తో భేటీ అయ్యారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి సతీసమేతంగా తాడేపల్లికి వచ్చారు మంత్రి పువ్వాడ అజయ్. ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం అయ్యారు. గోదావరి వరదల సందర్భంలో ఏపీపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు పువ్వాడ అజయ్ కుమార్.
సీఎం జగన్ ని కలిసేందుకు విజయవాడ వచ్చారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలసి నా కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు వచ్చాను. వైఎస్ తో మా తండ్రికి సత్సంబంధాలు ఉండేవి. సీఎం జగన్ మాకు మంచి ఆప్తుడు. టీఆర్ఎస్ ను ఢీ కొట్టే సత్తా ఎవరికి లేదు. ఏ ఎన్నికైనా మాకు సాధారణంగానే ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది.
21 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీకు గండి కొట్టాలంటే ఎవరి వల్ల కాదు. 21 ఏళ్లుగా అనేక ఒడుదుడుకులు టీఆర్ఎస్ ఎదుర్కొంది. కాంగ్రెస్ అంతర్గత వివాదాలపై మేం మాట్లాడం. సీఎం జగన్‌తో ఎటువంటి రాజకీయ చర్చలు లేవు. పూర్తిగా వ్యక్తిగతమైనదే నా పర్యటన. రాజకీయాలతో ఈ భేటీకి సంబంధం లేదు. కొద్దిరోజుల క్రితం భద్రాచలంలో పర్యటించిన అజయ్… గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం వల్ల భద్రాచలానికి ముప్పు వుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని, తెలంగాణకు చెందిన విలీన గ్రామాలను ఆంధ్రాలో కలిపిన వాటిని తిరిగి తెలంగాణలో కలపాలన్నారు పువ్వాడ అజయ్.

Hardik Pandya: అరుదైన ఘనత.. ఆ దిగ్గజాల సరసన నిలిచిన తొలి భారత ఆల్‌రౌండర్