ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రేపు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ముంపు గ్రామాల్లోను ఆయన పర్యటన కొనసాగనుంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలు తీర్చాలని.. వెంటనే పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. R&R ప్యాకేజీని వెంటనే అందజేయాలని సోము వీర్రాజు కోరారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ యథావిధంగా పనిచేస్తుందన్న ఆయన.. దానిని అమ్మే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. ఇక కేసీఆర్,…
కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం… పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ఉన్న ప్రాజెక్టు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నాం అన్నారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదు.…
పోలవరం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద… గోదావరికి అడ్డుకట్ట వేయడం ఇంజనీరింగ్ అద్భుతం అంటున్నారు నిపుణులు. గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులు మొదలు కాగా.. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్నారు అధికారులు. అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి…