ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేసిన ఘటనపై నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీవో శివజ్యోతి జిరాక్స్ పేపర్లుగా ప్రకటించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి కాల్చివేసిన కాగితాలను నేడు మంత్రి దుర్గేష్ పరిశీలించారు. Also Read: Champai Soren: జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం..…
Polavaram Project Files: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కలకలం రేపుతుంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి కార్యాలయంలో ఘటన చోటు చేసుకుంది.
పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సూచనలు చేసింది. వర్షాకాలం దాటగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్, నిర్మాణ అంశాలు చర్చించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ డిజైనర్, ప్రాజెక్టను పర్యవేక్షించే ఇంజినీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించింది.
ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. నీతి ఆయోగ్ భేటీ అనంతరం కేంద్ర మంత్రితో సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు కోరారు.
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ కేబినెట్ లో కీలక చర్చ జరిగింది.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది కేబినెట్ భేటీ.. దీంతో.. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను కొత్తగా నిర్మించనుంది ప్రభుత్వం. ఇక, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ లో ప్రతిపాదించనుంది ఏపీ ప్రభుత్వం..
నేడు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పోలవరం విషయంలో కీలక చర్చ జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయాఫ్రం వాల్ స్థితిగతులపై కేబినెట్లో కీలక సమీక్ష జరగనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Polavaram Floods: పోలవరం ప్రాజెక్టులోకి క్రమంగా వరద ఉధృతి పెరిగిపోతుంది. గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గరకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. స్పిల్ వేపైకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు తెరిచి కిందకు నీటిని రిలీజ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని.. వాళ్లతో చేరినవాళ్లు దెబ్బతింటారని ఆయన అన్నారు. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్లు ఇదే విధంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడైనా టీడీపీ, జనసేన పార్టీలు మేలుకోవాలన్నారు.
ఏపీలో కేఎల్ రావు జయంతిని ఘనంగా సీఎం చంద్రబాబు మొదలుపెట్టారని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేఎల్ రావు జయంతి నిర్వహించలేదన్నారు. అక్రమ ఇసుక తరలించడం మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.