ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేసిన ఘటనపై నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీవో శివజ్యోతి జిరాక్స్ పేపర్లుగా ప్రకటించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి కాల్చివేసిన కాగితాలను నేడు మంత్రి దుర్గేష్ పరిశీలించారు.
Also Read: Champai Soren: జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలోకి మాజీ సీఎం చంపై సోరెన్!
జిరాక్స్ కాగితాలని చెప్పుతున్న వీటిలో ఒరిజినల్ కాగితాలు ఉన్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారని, ఈ అపోహలను నివృత్తి చేయాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేశ్ విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని జాయింట్ కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌కు మంత్రి దుర్గేశ్ సూచన చేశారు. బాధ్యులైన సిబ్బందిని రక్షించవద్దని, పూర్తిస్థాయి విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.