ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరంను జగన్ అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అన్నారు. 20 ఏళ్ల క్రితం వైయస్ శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
Prof. Kodandaram: పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చీకట్లు అంటూ కేసీఆర్ వందల కోట్ల రూపాయలను నష్టం చేశారన్నారు.
ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. అధికారులతో పోలవరం ప్రాజెక్టు, స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన మొదటి పర్యటనలో భాగంగా సోమవారం పోలవరం వెళ్లనున్నారు.
చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్ చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనల…