Nimmala Ramanaidu: గత ప్రభుత్వ పాలన పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారింది.
చంద్రబాబు నాయుడుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడ దెబ్బతిందో తెలిస్తే ఒక అవగాహన వస్తుందని పేర్కొన్నారు.
Polavaram: పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల రంగం నిపుణులు నేటి నుంచి నాలుగు రోజుల పాటు పరిశీలించనున్నారు. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు.
Margani Bharat Ram: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణం అని ఆయన మండిపడ్డారు.
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు.