Nimmala Rama Naidu: అందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు: మంత్రి నిమ్మల
- రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే
- అబద్ధాల్లో జగన్‌కి ఆస్కార్ ఇవ్వొచ్చు
- జగన్‌కు ఎక్స్ వేదికగా మంత్రి నిమ్మల కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అర్థమైందని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే అని ఆరోపించారు. అబద్ధాల్లో జగన్‌కి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కౌంటర్ ఇచ్చారు. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసి.. జగన్ ఛీత్కారానికి గురయ్యారని నిమ్మల ఎద్దేవా చేశారు.
‘ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఈ వైఎస్ జగన్ తప్ప. ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్‌కు అర్థం అయిపోయింది. అందుచేతనే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు. పోలవరం ఎత్తుపై అతని చెత్త మీడియాలో అబద్ధాలు అచ్చు వేసి.. గడిచిన రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి నేను పూర్తి వివరాలతో పోలవరం ప్రాజెక్టుకు జగన్ చేసిన ద్రోహం గురించి వివరించా. అయినా అతని బుద్ధి మారలేదు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే. నాడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారు. కృష్ణ మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజెష్ కుమార్ ట్రైబ్యునల్‌కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశారు’ అని మంత్రి నిమ్మల ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
Also Read: IPL Retention 2025: 10 ఫ్రాంఛైజీలు విడుదల చేసిన ఆటగాళ్లు వీళ్లే..
‘పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి జగన్ కారుకులయ్యారు. ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోగొట్టారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా. పోలవరానికి కేంద్రం ఇచ్చిన 3800 కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు ఫేజ్‌లుగా విభజించింది జగన్ కాదా. కేంద్రాన్ని 41.15 మీటర్లకు తగ్గించి అనుమతి కోరింది జగన్ కాదా. మా ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లు పెంచి నదుల అనుసంధానం చేసి సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవింప చేస్తాం. జగన్ ఇప్పటికైనా అబద్ధాలు మాని.. మీ కుటుంబ కలహాల్ని చక్కబెట్టుకో. ఇది నీ హితువు కోరి చెబుతున్నా’ అని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!