Minister Atchannaidu: లిక్కర్ పాలసీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మద్యం తయారీ అమ్మకాన్ని దగ్గర పెట్టుకుని జగన్ అడ్డంగా దోచుకున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. లిక్కర్‌లో 40 వేలకోట్లు దోచుకున్నారని, 60 రూపాయలు వున్న క్వార్టర్ బాటల్ 250కి అమ్ముకున్నాడని విమర్శించారు. రాజమండ్రిలో మంత్రి అచ్చెం నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 90వేల దరఖాస్తులు మద్యం కోసం వస్తే 1800 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను సర్వ నాశనం చేశారన్నారు.
ఇసుక రీచ్‌లు రేపట్నుంచి మొదలవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పది రోజుల్లో ఇసుక సమస్య తీరుతుందన్నారు. నేరుగా ఇసుకను రీచ్‌లో నుంచే కొనుగోలు చేసే విధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇసుకను జగన్ గుప్పెట్లో పెట్టుకుని దోచుకున్నాడని ఆరోపించారు. 120రోజుల్లో పాలనలో కూటమి ప్రభుత్వం ఓ నమ్మకాన్ని కల్పించిందని అన్నారు. వర్షాల వల్ల ముంపునకు గురైతే విజయవాడలో బాధితులకు 15 రోజుల్లోనే పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. ఒక ప్రణాళిక బద్దంగా పని చేసి ఉభయ గోదావరి జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారు.
Read Also: AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో కీలక అంశాలు!
కూటమి ప్రభుత్వం 120 రోజులు అయ్యింది. వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చామన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను జగన్ సర్వ నాశనం చేశారని ఆరోపించారు.
నాలుగు మాసాల్లో హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు పోలవరం ప్రాజెక్టుకు 2500కోట్లు వచ్చాయని, పోలవరం 2027కు పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతిలో నవంబర్‌లో పనులు మొదలు పెడుతున్నామని ప్రకటించారు.