ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు. పోలవరం పనులపై మంత్రి అంబటి రాంబాబుకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరేం అడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిదంతా చేసేసి.. పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేం అని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని…
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంబటి రాంబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్‌పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని ఆయనన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు పూర్తవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అయితే వరద ఉధృతి కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తొందరపాటు చర్యల వల్ల ఆ వాల్ దెబ్బతిందని చెప్పిన రాంబాబు.. ఆ సమస్యని…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంపై ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. అయితే, ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు 2018 లోపలే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారుగా.. అపారమైన జ్ఞానం ఉన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు.? అని ప్రశ్నించారు. నాకు మిడిమిడి జ్ఞానం ఉందని చంద్రబాబు మీడియా…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు హయాంలో ప్రాధాన్యత ఉన్న కీలక పనులేవీ చేయలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. వైసీపీ ప్రభుత్వం కీలకమైన పనులే టేకప్ చేశాం. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పని చేశాం అన్నారు అంబటి. ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు.. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6…
ఏపీ ప్రజలకు జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం తన వైఖరి వెల్లడిస్తూనే వుంది. పోలవరం ప్రాజెక్టు 2013 -14 లో అంచనాలకు మేము అంగీకారం తెలిపాం. ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది.. పెరిగిన అంచనాలపై ఒక కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు కేంద్ర జల శక్తి, సహాయ మంత్రి.. ప్రహ్లాద్ సింగ్ పటేల్. దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ కి అరవై వేల కోట్లు కేటాయించాం. ఈ మిషన్లో 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రం…
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని.. పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని.. దశలవారీగా ఆ పని పూర్తిచేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోందని… 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని స్పష్టం చేశారు. అక్కడి వరకు ఉన్నవారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో త్వరగా అయిపోయే పనులు…
ఏపీలో వివిధ శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. రాష్ట్రంలో కీలకంగా భావించే ఇరిగేషన్ శాఖకు పార్టీ సీనియర్ నేత, అధికారప్రతినిధి అంబటి రాంబాబు మంత్రిగా వచ్చారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవిని ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. సమర్ధవంతంగా నా బాధ్యతను పూర్తి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం విషయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తా. రాయలసీమ సాగు నీటి…
విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస ప్రాజెక్ట్ వద్ద బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం కోసం రోజూ ముఖ్యమంత్రి వెళ్లి 55 వేల కోట్లు ఇచ్చేయండి అంటూ మోర పెట్టుకుంటున్నారని, ముఖ్యమంత్రికి ఉత్తరాంద్రా ప్రాజెక్ట్లు గుర్తుండటంలేదా అని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ కి దమ్ము, ధైర్యం, ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర…
ఏపీ జీవనాడి ప్రాజెక్టుగా పిలవబడుతున్న పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం పూర్తయింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్ 17న గేట్ల ఈ అమరిక పనులు ప్రారంభమయ్యాయి. గత సీజన్లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకు 84 సిలిండర్లను అమర్చారు.…
చంద్రబాబు పోలవరం బ్యారేజీ కడదామనే భ్రమలో ఉన్నారంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సెటైర్లు వేశారు. అందుకే పోలవరం బ్యారేజీ అంటున్నారని, మేము కడుతుంది పోలవరం ప్రాజెక్టేనని ఆయన అన్నారు. అంతేకాకుండా దీనిపై ఎవరితోనైనా ఓపెన్ డిబెట్ కు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఒక్క క్యూసెక్కు నీరు చుక్క తగ్గకుండా నీరు స్టోరేజ్ చేస్తామని, చంద్రబాబు తప్పిదాలు కారణంగా డయాఫ్రం వాల్ పునఃనిర్మాణం చేయాల్సి వస్తుందన్నారు. రాజమండ్రి నగరంలో 35 కోట్ల…