Ambati Rambabu: చంద్రబాబు, దేవినేని ఉమాకు సవాల్.. చర్చకు సిద్ధమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని తప్పిదాలపై చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవినేని ఉమాలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. డయాఫ్రమ్ వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బ తిందో చర్చ జరిగి తీరాల్సిందేనని ఆయన ముక్తకంఠంతో అన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం చారిత్రక తప్పిదమన్న రాంబాబు.. ఆ తప్పు వల్లే వరదలకు వాల్ దెబ్బతిందన్నారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్‌కు మరమ్మత్తులు చేపట్టాలా? లేక కొత్తది నిర్మించాలా? అనే విషయంపై దేశంలో ఉన్న మేధావులు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు.
ఫలానా సమయంలో లోపు పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తామని చెప్పలేమన్న అంబటి రాంబాబు.. దశల వారిగానే ఏ ప్రాజెక్టైనా పూర్తవుతుందని వివరణ ఇచ్చారు. మొదటి దశ పూర్తి చేయడానికి తాము సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి, ఎన్నికలకు వెళ్తామని చెప్పిన చంద్రబాబుకు.. ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందో సమాధానం చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందోనని అడిగే హక్కు టీడీపీ నేతలకు ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదల చేసిన సందర్భంగా అంబటి రాంబాబు పై విధంగా స్పందించారు.
Also Read
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
అనుకున్న విధంగానే తాము జూన్ 1న నీటిని విడుదల చేశామని.. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే విపత్తుల్ని ఎదుర్కునేందుకు ముందుగానే నీటిని సిద్ధం చేశామని అంబటి రాంబాబు అన్నారు. నారుమల్లు వేసుకోడానికి రైతులకు వీలుగా ఉంటుందని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే సమస్యల్ని పరిష్కరించి ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
-
Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
-
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!