జగన్ సర్కార్ పై సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన ఇదే సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు..? అని నిలదీశారు. పోలవరం కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుంటే కేంద్రానికి అప్పగించాలని సవాల్ విసిరారు. పోలవరం నిమిత్తం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లు ఇచ్చామని… మరో…
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు…
ఏపీకి పోలవరం ప్రాజెక్టు అతి ముఖ్యమైనది అని అందరికీ తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడం లేదు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై రాజ్యసభలో టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వకంగా సమాధానం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) రూ.120 కోట్ల జరిమాన విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్‌జీటీ ఈ జరిమానా విధించింది. మొత్తం రూ. 120 కోట్లను కట్టాలని ఎన్‌జీటీ పేర్కొంది. కాగా ఇ్పపటికే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగవంతంగా పనులను చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలకు తాగునీటి కష్టాలు తీరుతాయి.…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పోలవరం… కొన్ని అండకులు ఎదురైనా వేగంగా ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో పదవి కాలం ఈ నెల 27వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. సీఈవోగా పోలవరం అదనపు బాధ్యతలు చూస్తున్న చంద్రశేఖర్ అయ్యర్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రశేఖర్ అయ్యర్ పదవీ కాలాన్ని పొడిగించాలన్న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు…
లోకసభలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ చింతా అనురాధ… పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని నోటీసులో పేర్కొన్నారు.. అయితే, బుధవారం రోజు కేంద్ర జల శక్తి శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే వరకు పట్టు వదలకుండా పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీ…
పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ,…
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్ సైట్కు వెళ్లారు.. స్పిల్వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్వేపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో…
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సోమవారం సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. red also : కేటీఆర్ కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ ఇక సీఎం జగన్ పర్యటన వివరాల్లోకి వెళితే… ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 11.10 గంటల నుంచి 12…
ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నెల 14న ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి పోలవరం పర్యటనకు వెళ్ళనున్నారు. దీంతో జిల్లా అధికారులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 14న ఉదయం పది గంటలకు పోలవరం పర్యటనకు వెళ్ళనున్నారు. సీఎంతో పాటు జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పోలవరంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇంజనీర్…