ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. కీలక స్పిల్ వే నిర్మాణం పూర్తయినట్లు ఈ ప్రాజెక్టు పనులను చేపట్టిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు, అదేవిధంగా 98 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు సైతం పూర్తయ్యాయి. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్ల ఏర్పాటు పనులు,10 రివర్ స్లూయిజ్ గేట్ల ఏర్పాటుతో పాటు వీటికి ఒక్కో దానికి 2 చొప్పున 10 గేట్లకు 20హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు, రివర్ స్లూయిజ్ గేట్లను ఎత్తడానికి అవసరమైన 10 పవర్ ప్యాక్ సెట్ల అమరిక పనులను సైతం పూర్తి చేసినట్లు మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది.
ఇప్పటికే ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తి,140మీ పొడవున,53.320మీ ఎత్తున,12.5మీ వెడల్పున గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం పూర్తి కాగా, 52మీ ఎత్తున స్పిల్ వే గైడ్ బండ్ నిర్మాణ పనులు సైతం వేగవంతం చేసింది మెగా సంస్థ.. అప్రోచ్ ఛానెల్ లో 64.88లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు , ఫైలెట్ ఛానెల్‌లో 5.5లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు ,42.5 మీ ఎత్తున 2,480 మీ పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తయ్యింది. అటు అప్రోచ్ ఛానల్‌లో 64.88 లక్షల క్యూబిక్ మీటర్ మట్టి తవ్వకం పనులు, పైలట్ ఛానల్‌లో 5.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు, 42.5 మీటర్ల ఎత్తున 2,480 మీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. 1,630 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తులో దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణం పనులు, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి సంబంధించి గ్యాప్-2 ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్ పనులు సైతం వేగంగా సాగుతున్నాయి. గ్యాప్-1లో ఇప్పటికే డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు జలవిద్యుత్ కేంద్రంలో కొండ తవ్వకం పనులు పూర్తయ్యాయి. జలవిద్యుత్ కేంద్రంలో 12ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు సైతం పూర్తయినట్లు తెలుస్తోంది.
MEIL completed the spillway construction in the Polavaram irrigation project with the installation of 48 radial gates and 98 hydraulic cylinders. It has also installed 24 powerpack sets to lift the gates.#polavaramproject #spillway #gates #meil #andhrapradesh pic.twitter.com/ZQrimn8clE
— Megha Engineering and Infrastructures Ltd (@MEIL_Group) May 21, 2022