Ambati Rambabu: చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంపై ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. అయితే, ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు 2018 లోపలే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారుగా.. అపారమైన జ్ఞానం ఉన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు.? అని ప్రశ్నించారు. నాకు మిడిమిడి జ్ఞానం ఉందని చంద్రబాబు మీడియా వార్తలు రాసింది అని ఫైర్ అయ్యారు.. దెబ్బతిన్న డయాఫ్రమ్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని వెల్లడించిన అంబటి.. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలించింది.. వారు ఇచ్చే సూచనల కోసం ఎదురు చూస్తున్నాం.. కానీ, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి కారణం ఎవరు?? చంద్రబాబు ప్రణాళికా రహితంగా వెళ్ళటం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు.
Read Also: Kakani Govardhan Reddy: నల్లపురెడ్డితో మంత్రి కాకాణి భేటీ.. విషయం ఇదే..!
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గోదావరి నది నీటిని మళ్లించి, స్పిల్ వే ఛానల్ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి.. కానీ, చంద్రబాబు ఒకేసారి అన్ని పనులు చెయ్యటం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు అంబటి రాంబాబు.. ఈ విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని విమర్శించారు. ఇక, 35 కాంటూరు దగ్గర గ్రామాలకు పునరావాసం కల్పించాం.. అప్రోచ్ ఛానల్, స్పిల్ వే పూర్తి చేసి నదీ మార్గాన్ని మళ్ళించామని తెలిపారు.. రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేశామన్నారు. మరోవైపు, నాగార్జునసాగర్ విషయంలో తెలియక కొంత పొరపాటు పడిన మాట వాస్తవం.. ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలోనూ డయాఫ్రమ్ ఉంటుంది అనుకున్నా… తెలియనివి తెలుసుకుంటా అన్నారు. దేవినేని ఉమా గురించి అదో, ఇదో తెలియదు అంటున్నారు… వైద్యులకు చూపించుకోవటం మంచిదని సెటైర్లు వేశారు. డయాఫ్రమ్ వాల్ పడిన గుంతలు పూడ్చడానికి 800 కోట్లు ఖర్చు అవుతుంది.. నీళ్లు తోడాలంటే 2వేల కోట్లు ఖర్చు అవుతుంది.. ఈ పాపం చంద్రబాబుది కాదా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!