పోలవరం నిర్వాసితులకు అంతా బాగుందని కేంద్రమంత్రికి జగన్ చెప్పించే ప్రయత్నం చేశారని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావసం కింద ఎన్ని ఇళ్లు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో సీఎం ఉన్నారని, దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పోలవరం పరిశీలనకు వస్తే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అడ్రస్ లేడని, జరిగిన పనులు…
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం నాడు ఏపీ సీఎం జగన్ తో కలిసి పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పోలవరం ప్రాజెక్టును సందర్శించానని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత…
నేడు సీఎం జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో కలిసి తూర్పు ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీల సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
నేడు సీఎం జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో కలిసి తూర్పు ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీల సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు దేవీపట్నం మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకుంటారు. అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి ఉదయం 10.10 గంటలకు ఇందుకూరుపేట-1 పునరావాస కాలనీకి వస్తారు. ఆ తరువాత కాలనీని 10.40 గంటలకు పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడతారు. 11 గంటలకు ఇక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో…
రేపు పోలవరానికి సీఎం వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా పోలవరం పునరావాస కాలనీలలోనూ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు. అయితే 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి సీఎం జగన్ చేరుకోనున్నారు. అక్కడ నిర్వాసితులతో జగన్…
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. రేపు సాయంత్రం 7.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి రానున్నారు కేంద్ర మంత్రి షెకావత్… ఆయనకు రాత్రి విందు ఇవ్వనున్నారు ఏపీ సీఎం.. ఇక, మార్చి 4వ తేదీన సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టులోని నిర్వాసిత కాలనీలు, ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద పీపీఏ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు గజేంద్ర సింగ్ షెకావత్……
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో రెండేళ్ల పాటు ప్రభుత్వానికి ఊరట దక్కింది.. అనుమతులు లేని కారణంతో 2011లో పనుల నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర పర్యావరణ శాఖ.. 2015లో ఈ ఉత్తర్వులను అభయెన్సులో పెట్టిన కేంద్రం ప్రభుత్వం.. అయితే, ఆ అభయెన్సు ఉత్తర్వులను ప్రతీ ఏటా కొనసాగిస్తూ వస్తున్న కేంద్ర సర్కార్.. మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది… తాజాగా…
దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే న్యూస్ అందించింది. ఇకపై దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి 60 శాతం మాత్రమే నిధులు వస్తాయని స్పష్టం చేసింది. మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తేనే… కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదల అవుతాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ సారి లేఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రస్తావించారు.. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని లేఖలో కోరిన ఆయన.. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని కోరిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించి రూ. 10 లక్షల ప్యాకేజీ…
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో గంటసేపు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ప్రధానికి నివేదించారు. ఈమేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు సీఎం జగన్. రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయన్నారు సీఎం. రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ…