Polavaram Project Upper Cofferdam: ఇటీవల గోదావరి నదికి అనూహ్య స్థాయిలో వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దిగువ కాఫర్ డ్యాంపైకి నీరు ఎగదన్నింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో ప్రధాన జలాశయం నిర్మించాల్సిన ప్రదేశానికి ఎగువన నిర్మించిన కాఫర్ డ్యామ్‌ను ఎత్తును పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 1 మీటరు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూలై15న ఎగువ కాఫర్…
Telugu Desam Party Leader Devineni Uma: పోలవరం ప్రాజెక్టు విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంచడానికి ఎవరి అనుమతి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాఫర్ డ్యాం ఎత్తు పెంచడానికి పీపీఏ అనుమతిచ్చిందా లేదా సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చిందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ చెప్పారంటూ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచేస్తామని మంత్రి అంబటి రాంబాబు చెప్పడం…
పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతికి సంబంధించి ప్రమాదకర పరిస్థితులను శుక్రవారం మధ్యాహ్నం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రస్తుతం పోలవరం వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే కాఫర్ డ్యామ్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని తెలిపారు. అందుకే పటిష్ట చర్యలు…
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఏం చేసిందన్న దానిపై.. మేము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు మేం (కేంద్ర ప్రభుత్వం) బాకీలేము… ఆ ప్రాజెక్టును భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.. పోలవరాన్ని కేంద్రం కట్టించి ఉంటే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేది.. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆరోపించారు సోమువీర్రాజు… ఇక, ఈ సమయానికే పోలవరం పూర్తి అయిఉంటే మిగులు జలాలతో…
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో.. దిగువ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారింది.. గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలం అవుతున్నాయి పోలవరం ముంపు మండలాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు.. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోగా.. మరోవైపు గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది..…