Undavalli: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్… పోలవరం నిర్మాణం పూర్తి కాదని ఆయన స్పష్టం చేశారు.. పోలవరం డ్యామ్ అనేది ఉండదన్న ఆయన.. భారీ ఎత్తున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని నేను మానసికంగా సిద్ధపడ్డానని పేర్కొన్న ఆయన.. ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. పోలవరాన్ని కట్టే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు.. అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలకు లేదు అంటూ ఘాటు విమర్శలుచేశారు.
Read Also: Mumbai: మహిళతో వృద్ధుడి శృంగారం.. మధ్యలోనే కుప్పకూలి..!
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమూ అలాగే ఉందన్నారు ఉండవల్లి… కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు భుజాలకెత్తుకున్నారని నాడు వైసీపీ ప్రశ్నించిందని గుర్తుచేసిన ఆయన.. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ఇప్పటి ఇరిగేషన్ మంత్రి చెప్పారు.. ఇందులో నిజముందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రానికి పోలవరం బాధ్యతలు ఎందుకు అప్పగించ లేదు..? అని నిలదీశారు ఉండవల్లి.. పోలవరంతో సహా విభజన హక్కులను సాధించుకునే పరిస్థితి లేదన్నారు. దానిపై గత కారణాలపై కూడా సీరియస్ కామెంట్లు చేశారు.
ప్రధాన పార్టీల అధినేతల ఆస్తులు హైదరాబాదులోనే ఉన్నాయన్నారు ఉండవల్లి.. హెరిటేజ్, భారతి సంస్థల హెడ్ ఆఫీసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయి కాబట్టే వైసీపీ, టీడీపీలు విభజన సమస్యలపై పోరాడలేకపోతున్నాయని ఆరోపించారు.. ఈ విషయాలన్నీ చాలా రోజుల నుంచి నేను చెబుతూనే ఉన్నా.. ఎవ్వరూ పట్టించుకోవడం… అందుకే నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌లు తగ్గించేశానని తెలిపారు. ఇక, చంద్రబాబు హయాంలో కనీసం నన్ను విమర్శించడానికైనా మాట్లాడేవారు.. కానీ, వైసీపీ వాళ్లు ఏం మాట్లాడడం లేదు.. అయితే, సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ పోయిందని 2017లోనే నేను చెప్పాను.. అప్పట్లో నేను చెబితే నన్ను నాటి మంత్రి విమర్శించారని గుర్తుచేసుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!