PM Modi to address third ‘No Money for Terror’ meet: ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో భారత్ ఎప్పుడూ దృఢంగా వ్యవహరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో అన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు కొత్త ఆర్థిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని అన్నారు. మేము వేలాది ప్రాణాలను కోల్పోయామని.. అయితే మేము ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఉగ్రదాని కూడా మేం తక్కువగా భావించడం…
దేశానికి ఓబీసీ ప్రధాని అయితే అందరం సంతోష పడ్డామని.. కానీ 8 ఏళ్లలో ఒక పని కూడా చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. మండల కమిషన్ సిఫార్సు ముందుకు దాటట్లేదని ఆయన అన్నారు.
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు.
President Biden's 'Salute' To PM Modi At G20: ఇండోనేషియా బాలిలో జీ-20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్, ఇతర అధినేతలు మడ అడవులను సందర్శించి మొక్కలు నాటారు. బాలిలోని తమన్ హుటాన్ రాయ మడ అడవులను దేశాధినేతలు సందర్శించారు.
ఇండోనేషియాలోని బాలిలో ఓ ప్రముఖ హోటల్ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గాన్ని కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు.
ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. బాలిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
PM Modi to embark for Bali today for G20 Summit: ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రోజున బాలికి బయలుదేరనున్నారు. ఆహారం, ఇంధన భద్రత- ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి వాటిపై వర్కింగ్ సెషన్స్ జరగనున్నాయి. ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్…