PM Modi to embark for Bali today for G20 Summit: ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రోజున బాలికి బయలుదేరనున్నారు. ఆహారం, ఇంధన భద్రత- ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి వాటిపై వర్కింగ్ సెషన్స్ జరగనున్నాయి. ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్…
Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాకుపై పేలుడు సంభవించింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అసర్వా-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లడానికి గంటల ముందు, ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే దీంట్లో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయపూర్‌లోని జావర్ మైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెవ్డా కి నాల్ సమీపంలోని ఓధా వంతెనపై ట్రాక్‌లను దెబ్బతీయడానికి మైనింగ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
జేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతోనే తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్ ప్రొసీజర్ ఎలా నడుస్తుందో తెలవని ప్రధాని.. తెలంగాణ బిల్లును తలుపులు మూసి బిల్లును ఆమోదించి అవమానించారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఒక రాజులా పాలిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన జాతికి అంకితం అయినా ఎల్‌ఐసీ, విశాఖ స్టీల్, టెలికాంను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.
S Jaishankar Meets Ukraine Minister To Discuss Ways To End Russia War: కంబోడియా వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో భేటీ అయ్యారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ముగించే మార్గాలను చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన కోసం జైశంకర్ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. కంబోడియా రాజధాని నమ్ పెన్ లో జరుగుతన్న…