ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్ మోడీని ప్రధాని కలిశారు. గుజరాత్ రెండో దశ ఎన్నికల నేపథ్యంలో తన తల్లి ఆశీర్వాదాలను తీసుకున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. డిసెంబర్ 5న సోమవారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ హేమాహేమీ నాయకులను ప్రచార బరిలోకి దింపాయి.
Prime Minister Narendra Modi reacts to Mallikarjuna Kharge's 'Ravan' comments: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘ రావణ్’ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. గురువారం గుజరాత్‌లోని కలోల్లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రావణ్ వ్యాఖ్యలను గురించి ప్రస్తావించారు. మోదీని ఎక్కువగా దూషించాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాముడిని ఎప్పుడూ నమ్మ లేదని మోదీ అన్నారు. డిసెంబర్ 5వ విడత…
Terrorism is vote bank for Congress, says pm narendra modi: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆదివారం గుజరాత్ లోని ఖేడా ప్రాంతంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిందని.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులు దేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాడాలని కోరామని..కానీ వారు మాత్రం…