Boora Narsaiah Goud Demanding Sorry From CM KCR: పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీని బీఆర్ఎస్ మంత్రులు క్షమాపణలు కోరడం సిగ్గుచేటు అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. వాళ్లు ఇలా డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసలు నోట్ల రద్దుకు మొదట మద్దతు తెలిపిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని.. కాబట్టి ముందు ఆయన్ను క్షమాపణ చెప్పమనండని కోరారు. నోట్ల రద్దుపై బీఆర్ఎస్ నేతలతో తాము చర్చకు సిద్ధమని, మీరు సిద్ధమా? అని సవాల్ విసిరారు. నోట్ల రద్దు విషయంలో గోబెల్స్ మించిన అబద్ధాలను మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారని విమర్శించారు. గతంలో లార్జెస్ట్ ఎకానమీలో మన భారతదేశం 11వ స్థానంలో ఉంటే.. మోడీ వచ్చిన తర్వాత 5వ స్థానానికి ఎగబాకిందని పేర్కొన్నారు. 2027 నాటికి 3వ స్థానంలోకి వస్తామని జోస్యం చెప్పారు.
Rashid Latif: రెస్ట్ ఇన్ పీస్ పాకిస్తాన్ క్రికెట్.. మాజీ క్రికెటర్ సంచలనం
మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుకునేందుకు వినియోగించిన యూపీఐ పేమెంట్స్ విధానాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోడీనే అని, ఆ యూపీఐ పేమెంట్స్ ద్వారానే బీఆర్ఎస్ నేతలు ఓట్లు కొనుక్కున్నారని బూర నర్సయ్య ఆరోపణలు గుప్పించారు. బ్లాక్ మనీ, హవాలా మనీ తగ్గడానికి నోట్ల రద్దు నిర్ణయమే కారణమన్నారు. ఈ నిర్ణయం వల్లే టెర్రరిజం కూడా భారీగా తగ్గిపోయిందన్నారు. పాకిస్తాన్ గతంలో ఇండియన్ కరెన్సీని ముద్రించి, దొంగనోట్లు చెలామణి చేయడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకుందని.. మోడీ నిర్ణయం కారణంగా పాక్‌కి భారీ దెబ్బ తగిలిందని చెప్పారు. యథా సీఎం తథా అధికారులు అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి మారిందన్నారు. పోటీ పరీక్షలు కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pune: భార్యా, కొడుకును హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ఇదే సమయంలో బూర నర్సయ్య తెలంగాణలో భారీ లిక్కర్ స్కామ్ జరుగుతోందని కుండబద్దలు కొట్టారు. ఒకే రోజు టెండర్ నోటిఫికేషన్ వేసి, ఒక్కరే దరఖాస్తు చేస్తారన్నారు. రోజుకో రూ.1 కోటి దందా జరుగుతోందని, ఏడాదికి రూ.365 కోట్ల స్కామ్ సాగుతోందని పేర్కొన్నారు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్దదని వెల్లడించారు. ‘టానిక్’ షాపుల కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెడుతామన్నారు. వైన్స్, బెల్ట్ షాపులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆర్టీసీ బస్సుల్లో పెట్టుబడులు, అందులోని బినామీలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము తెలంగాణ సర్కార్‌కు ఉందా? అని ప్రశ్నించారు. అద్దాల మేడలో ఉండి, మోడీ ప్రభుత్వంపై రాళ్లు వేయొద్దని హితవు పలికారు.
Air Hostess Archana: వీడిన ఎయిర్‌హోస్టెస్ మృతి మిస్టరీ.. అతడే చంపేశాడు