వరంగల్‌లో సీఎం కేసీఆర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన విమర్శలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. ప్రధాని హోదాలో మోడీ అన్ని అబద్దాలే మాట్లాడారు అని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ పెద్ద దద్దమ్మ.. రాహుల్, మోడీ ఇద్దరూ దొంగలే.. దేశం నాశనానికి వీరే కారకులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి రారాజులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంటూ విమర్శించారు.
Read Also: Delhi : పోర్న్ వీడియోలను చూడాలని భార్యను బలవంతం పెట్టిన భర్త .. కట్ చేస్తే సీన్ రివర్స్..
ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సర్కార్ పని అంటూ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడ స్థానం ఇవ్వరు అని ఆయన అన్నారు. బీజేపీ దుర్మార్గపు పాలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చరమ గీతం పాడబోతున్నారు అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. వరంగల్‌కు వచ్చిన మోడీ తెలంగాణాకు మొండి చేయి ఇచ్చి, అక్కసు వెళ్లగక్కి వెళ్ళారని అన్నారు.
Read Also: Minister KTR: ప్రధాని మోడీ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ రియాక్షన్..
కేసీఆర్ కీర్తి ఢీల్లీ తాకుతుందని మోడీకి భయం పట్టుకుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అవినీతిలో కాంగ్రెస్‌ను బీజేపీ మించిపోయింది. గుజరాత్‌లో కూలిన బ్రిడ్జిలే బీజేపీ అవినీతికి సాక్ష్యమన్నారు. ఆ మాత్రం వ్యాగన్ తయారీ చేసుకునే సత్తా తమకు ఉందని మంత్రి చెప్పారు. అయితే.. అవినీతికి రాజు కాంగ్రెస్ అయితే రారాజు బీజేపీ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పని అంటూ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించాడు.