Jeevan Reddy Says PM Modi Following CM KCR Steps: తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, ఆ తర్వాతి పరిణామాలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు మౌనదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. దేశంలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళను దృష్టిలో పెట్టుకొని.. నాలుగు సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ మాట్లాడారన్నారు. ఆ ఆరోపణలకు పూర్తి శిక్షకాలం రెండు సంవత్సరాలు మాత్రమేనన్నారు. కానీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. అలాగే.. 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా కుట్రపన్నారని ఫైరయ్యారు.
Son Attacked Mother: మద్యం తాగేందుకు ఫైసల్ ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
గతంలో గవర్నర్ ప్రసంగం అడ్డుకున్నారని.. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను కేసీఆర్ ప్రభుత్వం సభ్యత్వం చేసిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ తరహాలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిందని.. చూస్తుంటే కేసీఆర్ అడుగుజాడల్లో మోడీ నడిపిస్తున్నట్టు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిరిండియాను మోడీ టాటా గ్రూప్‌కి అప్పగించాడని వ్యాఖ్యానించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై రాహుల్ గాంధీ ప్రశ్నించినందుకే.. పార్లమెంట్‌లో ఆయన ఉండకుండా చేయాలని చూశారన్నారు. ప్రాణ త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ప్రధానిగా అవకాశం వచ్చినా.. మన్మోహన్ సింగ్‌కి ఆ పదవి ఇచ్చిన ఘటన గాంధీ కుటుంబానిదన్నారు. ఉచిత విద్యుత్ విషయంలో పీపీఏ ఒప్పందంలో వేల కోట్ల అవినీతి జరిగిందని తమ పీసీసీ చీఫ్ అంటే, ఆ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఉద్ఘాటించారు.
Rahul Gandhi: ప్రధాని అవ్వకుండా రాహుల్‌పై బీజేపీ కుట్ర.. కాంగ్రెస్ నేతలు ఫైర్