రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సంబంధించిన ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుతిన్ ‘శాంతాక్లాజ్’ వేషధారణలో ఆయా దేశాధినేతలకు గిఫ్ట్‌లు పంపించారు. భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా బహుమతులు పంపించినట్లుగా వీడియోలో కనిపించింది. ఆయా అధ్యక్షుల తీరుకు తగ్గట్టుగా గిఫ్ట్‌లు ఉన్నట్లుగా వీడియోలో కనిపించింది.
ఇది కూడా చదవండి: Trump: నెతన్యాహు లేకుంటే ఇజ్రాయెల్ ఉనికిలో ఉండకపోయేది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
కెన్యాలోని రష్యా కాన్సులేట్ తన ఎక్స్ ఖాతాలో ఏఐ వీడియో పోస్ట్ చేసింది. అందులో పుతిన్ శాంతాక్లాజ్ వస్త్రాలు ధరించి ఉన్నారు. ప్రపంచ దేశాధినేతలకు కానుకలు పంపినట్లుగా ఏఐ వీడియోను రూపొందించారు. పుతిన్ తన స్నేహతులందరికీ ఒక్కొక్క విధమైన బహుమతులు పంపిస్తే.. జెలెన్‌స్కీకి మాత్రం విచిత్రమైన గిఫ్ట్‌ను పంపించినట్లుగా ఉంది.
ఇది కూడా చదవండి: Bengaluru: కన్నడ టీవీ నటి నందిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
తొలుత వీడియోలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించారు. గిఫ్ట్ ఓపెన్ చేయగానే బీజింగ్, రష్యా కరెన్సీల చిత్రాలు కనిపించాయి. ఇక ట్రంప్-పుతిన్ ఇటీవల అలస్కాలో భేటీ అయిన ఫొటోను కానుకగా పంపినట్లుగా వీడియోలో కనిపించింది. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీకి యుద్ధ విమానాలు కానుకగా పంపించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కత్తి, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు డీజే సెట్ పంపించగా… చివరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మాత్రం భయపెట్టే విధంగా గిఫ్ట్‌లో ‘సంకెళ్లు’ ఉన్నట్లు చూపించారు.
🎁 Christmas season is the time of giving, when Russia makes sure that all of its friends get something nice and are well and merry.
As for the naughty ones, they too will get what is coming for them. pic.twitter.com/NqRnm0v3BG
— Russian Embassy in Kenya/Посольство России в Кении (@russembkenya) December 28, 2025