PM Modi: దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్‌కి ఉంది.. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్నూలు శివారులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఏపీలో ఉందన్నానరు.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోందన్న ఆయన..…
PM Modi: ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి.. ఏపీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉంది.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోంది అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అహోబిలం నరసింహస్వామి, మహానందీశ్వరుడికి నమస్కరిస్తున్నా.. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్లో నేను జన్మించాను.. విశ్వనాథుడి భూమి అయిన…
CM Chandranaidu: సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలందరూ ప్రయోజనం…
Deputy CM Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీని కర్మయోగిగా చూస్తాం.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కాబట్టే మోడీని కర్మయోగి అంటాం అని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, నారా లోకేష్.. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇతర నేతలు హాజరయ్యారు. ఈ…
Minister Nara Lokesh: నమో అంటే విక్టరీ, ఆయన ఏది చేపట్టినా విజయమే అంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు మంత్రి నారా లోకేష్.. ప్రపంచ దేశాలు పన్నులు పెంచితే, మన ప్రధాని నరేంద్ర మోడీ ట్యాక్స్‌లు తగ్గించారని గుర్తుచేశారు.. దసరా, దీపావళి పండుగలు కలిసి వస్తే వచ్చేది సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అని అభివర్ణించారు.. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభకు…
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇందులో భాగంగా ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి.. ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్‌లో శ్రీశైలంకు చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్న, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.. ఆ తర్వాత కర్నూలులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి హాజరయ్యారు…
ప్రధాని మోడీ ప్రతి ఏడాది ఒక్కో చోట దీపావళి జరుపుకుంటారు. సైనికులతో కలిసి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆపరేషన్ సిందూర్‌కు గుర్తుగా గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తున్నట్లు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు.
యుద్ధాలను ఆపడం తనకు చాలా ఇష్టమని ట్రంప్ అన్నారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడారు. ఏ అధ్యక్షుడు కూడా ఒక్క యుద్ధాన్ని ఆపలేదని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను మాత్రం ఎనిమిది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా తనకు నోబెల్ బహుమతి వచ్చిందా? అంటే లేదన్నారు.