PM Modi: కాంగ్రెస్‌కి ఓటు బ్యాంక్ వైరస్.. వక్ఫ్ చట్టంపై మోడీ సంచలనం..
- కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
- ఆ పార్టీకి ఓటు బ్యాంక్ వైరస్ పట్టిందన్న పీఎం..
- వక్ఫ్‌ని ఓట్ల కోసం వాడుకుందని విమర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: హర్యానా హిస్సార్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు చట్టాలను మార్చిందని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్ఫ్ బోర్డు రూల్స్‌ని కాంగ్రెస్ మార్చిందని అన్నారు. కాంగ్రెస్‌కి ఓటు బ్యాంక్ వైరస్ పట్టుకుందని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీకు వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తుందని, వక్ఫ్ బోర్డు పేరుతో కాంగ్రెస్ భూముల్ని దోచుకుందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను మోసం చేసిందని, వాళ్ల రిజర్వేషన్లను చీల్చి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. వక్ఫ్ వల్ల పేద ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం లేదని, పేద ముస్లింలు పంచర్ షాపులకే పరిమితమయ్యారని అన్నారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు పేరుతో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఒక్క ముస్లింని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించలేదు, ఎందుకు..? అని మోడీ ప్రశ్నించారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Read Also: Mehul Choksi: 7 ఏళ్లుగా మెహుల్ చోక్సీ కోసం భారత్ వేట.. చివరకు ఇలా చిక్కాడు..
వక్ఫ బోర్డు పేరiతో లక్షల హెక్టార్ల భూమిని కొల్లగొట్టారని, వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు, ఆదివాసుల భూముల్ని లాక్కున్నారని మోడీ అన్నారు. పేదు ముస్లిం మహిళలు, వితంతు మహిళలు కేంద్ర ప్రభుత్వాన్ని వక్ఫ్ బోర్డుపై లేఖలు రాశారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగం కన్నా వక్ఫ్‌నే పెద్దదిగా చేసిందని అన్నారు.
2014కు ముందు దేశంలో 74 ఏయిర్‌పోర్టులు ఉంటే, ఈ రోజు 150 ఎయిర్‌పోర్టలు ఉన్నాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో 74ఏయిర్ పోర్టులు మాత్రమే నిర్మించిందని అన్నారు. బీజేపీ పాలనలో కనెక్టివిటీ పెంచేందుకు ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. పేదల సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?