తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం 10.30కు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం భేటీ కానున్నారు. బీసీ కులగణన రిజర్వేషన్లు, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. అలానే ఎస్ఎల్బీసీ ప్రమాదంను పూర్తిస్థాయిలో ప్రధానికి వివరించనున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోడీతో సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో.. మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.…
ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.. ఉత్తర్వులు జారీ ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమితులయ్యారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. కాగా.. ఫైబర్ నెట్ ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఎండీ దినేష్ కుమార్‌ను జీఏడీకి అటాచ్ చేసింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. దినేష్ వైఖరిపై నిన్న జీవీ రెడ్డి రాజీనామా…
CPM: ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ని నియో-ఫాసిస్టుగా పార్టీ పరిగణించడం లేదని సీపీఎం తన రాజకీయ ముసాయిదా తీర్మానంలో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. హస్తానికి గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేకపోతే చెప్పాలని.. తన ముందు చాలా ఆఫర్లు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఎన్నికలప్పుడే ప్రధాని మోడీకి బీహార్ రాష్ట్రం గుర్తుస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ సోమవారం బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్.. మోడీ టూర్‌ను ఉద్దేశించి 15 ప్రశ్నలు సంధించారు.
PM Modi: మహాకుంభమేళాని ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ, సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మోడీ ఆదివారం ఆరోపించారు. మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలను అపహాస్యం చేసే రాజకీయ నాయకులను, భారతదేశ మత వారసత్వాన్ని దెబ్బతీసే ‘‘ బానిస మనస్తత్వం’’ కలిగిన వ్యక్తులుగా మోడీ అభివర్ణిస్తూ విమర్శించారు.
Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా నిధులను ఉపయోగించిందని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) అందించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేశాయి. యూఎస్ఎయిడ్ నిధుల్ని కాంగ్రెస్, దాని ఎకోసిస్టమ్ వాడుకుందని బీజేపీ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించింది.
PM Kisan: పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోడీ ఈ పథకం కింద 19వ విడతగా మొత్తం రూ.22వేల కోట్లను రేపు (ఫిబ్రవరి 24) విడుదల చేయనున్నారు. బీహార్‌లోని భాగల్పూర్లో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను రిలీజ్ చేస్తారు.