Asaduddin Owaisi: కేంద్రం ఇటీవల జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’ చేస్తామని ప్రకటించింది. 2024 ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్తో సహా పలు ఇండీ కూటమి పార్టీలు కులగణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కులగణనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల్ని లేవనెత్తారు. కులగణనకు కేంద్రం ఒక టైమ్ లైన్ ఉండాలని కోరారు.
నిన్న ప్రధాని మోడీ అమరావతికి వచ్చారు.. మొన్న వచ్చినప్పుడు (అమరావతి శంకుస్థాపనకు తొలిసారి వచ్చినప్పుడు) నీరు - మట్టి తీసుకొచ్చారు.. ఈసారి (అమరావతి రీలాంచ్) ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కి చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్కి భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ని ఎలా దెబ్బతీస్తే ఆ దేశం పతనమవుతుందో అలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే, పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, సినీయాక్టర్ల ఇన్స్టా అకౌంట్లు, యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. పాక్ మీడియా, వెబ్సైట్లను నిషేధించింది. ఇదే కాకుండా, పాక్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని నిషేధించింది
అమరావతి రీలాంచ్పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పది సంవత్సరాలకు రాజధాని నిర్మాణానికి పునాదిరాయి వేశారు.. అయితే, గత ఐదు సంవత్సరాలు అమరావతి పనులు ఆగిపోయినందుకు ప్రధాని నరేంద్ర మోడీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు..
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు 26 మంది సాధారణ పౌరుల్ని క్రూరంగా కాల్చి చంపారు. ఉగ్రవాదులు, దాని మద్దతుదారులు ప్రపంచంలో ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని ఇప్పటికే ప్రధాని ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అనంతరం వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది.
కుల గణనపై ప్రధాని మోడీకి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లేఖ రాశారు. జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ స్వాగతించింది.
India-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితి తీవ్రతను మరింత పెంచారు. భారత్ తమపై దాడికి సిద్ధమవుతుందని సాక్ష్యాత్తు ఆ దేశ మంత్రులే వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యం భారత సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పై భారత్ దాడి చేస్తుందేమో అని పాక్ తెగ భయపడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పీఓకేలోని…
విశాఖలో జూన్ 21న జరగనున్న యోగా డేలో తాను పాల్గొంటానని, తనను ఆహ్వానించినందుకు సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు సంబంధించిన విస్తృత కార్యక్రమాలు జరగాలన్నారు. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదని, ఆ కలల్ని నిజం చేసే వారి సంఖ్యా తక్కువ కాదన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారని, ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ…