Minister Nara Lokesh Delhi Tour: ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు మంతరి లోకేష్.. రేపు సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. గతంలో రెండు సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు ప్రధాని మోడీ.. దీంతో, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ అడిగారట లోకేష్.. ఇక, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో.. హస్తినబాట పట్టనున్నారు.. రేపు సాయంత్రం కలవాలని ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో.. రేపు ప్రధాని మోడీతో నారా లోకేష్ సమావేశం అవుతున్నారు..
Read Also: Peddi : ‘పెద్ది’లో క్రికెట్ ను మించి వేరే ఉంది.. బుచ్చిబాబు కామెంట్స్
అనంతపురం జిల్లా పర్యటన ముగించుకున్న మంత్రి నారా లోకేష్.. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో అపాయింట్‌మెంట్ కన్ఫర్మ్ కావడంతో హుటా హుటిన హైదరాబాద్ బయల్దేరారు.. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లనున్నారు.. ఇక, రేపు సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశం కాబోతున్నారు మంత్రి నారా లోకేష్.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉండగా.. కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్‌లోనూ టీడీపీ కీలకంగా ఉంది.. ఈ మధ్యే అమరావతి రీలాంచ్ కోసం ఏపీలో పర్యటించిన ప్రధాని మోడీ.. ఇప్పుడు మంత్రి నారా లోకేష్‌తో ఏ అంశాలపై చర్చించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, కడపలో జరగనున్న మహానాడులో పార్టీలోనూ నారా లోకేష్‌కు మరింత కీలక బాధ్యతలు కట్టబెడతారనే చర్చ సాగుతోన్న వేళ.. ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.