కాసేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ నిర్వహించిన సమావేశంలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో తాజాగా చర్చించిన అంశాలను ప్రధాని మోడీ దృష్టికి రాజ్‌నాథ్ తీసుకెళ్లనున్నారు.
సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యంగా పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో, ఎయిర్ పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి ఇంట్లో ఈ కీలక సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆపరేషన్ సిందూర్‌ను అభినందిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది.. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపింది కేబినెట్..
ప్రధాని మోడీని, భారతదేశాన్ని నాశనం చేస్తానంటూ హెచ్చరించారు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తానంటూ మసూద్ అజహర్ లేఖలో ప్రస్తావించారు.
మొత్తం ఆపరేషన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. భారత ఆర్మీకి సపోర్టుగా నిలిచారు. ఇక, ఉగ్రవాద శిబిరాలపై దాడుల వివరాలను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు తెలియజేశారు.
Kishan Reddy: భారత్-బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందంగా నిలిచిపోతుంది అన్నారు.
అట్టహాసంగా జరిగిన అమరావతి రీ లాంఛ్ ప్రోగ్రామ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే... ఇప్పటివరకు ఇచ్చిన, ఇస్తున్న నిధులు కాకుండా ప్రధాని నోటి నుంచి ప్రత్యేక నిధుల ప్రస్తావన వస్తుందని రాష్ట్రం వైపు నుంచి ఆశించినా... అ మాట మాత్రం చెప్పలేదాయన.
Cabinet Meeting: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత ఈ సమావేశం జరుగబోతోంది. పాకిస్తాన్‌పై సైనిక చర్య తీసుకుంటారనే ఊహాగానాల నడుమ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్రమోడీకి ముందే సమాచారం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి మూడు రోజుల ముందే ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఆ తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి తన పర్యటనను రద్దు చేసుకున్నారని మంగళవారం ఆరోపించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరగడానికి మూడు రోజులు ముందే ప్రధానికి ఇంటెల్ నివేదిక పంపినట్లు ఖర్గే తెలిపారు.