BJP MP Laxman: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలన పైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్మారు అని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారు.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు మోడీ.. దేశంలో అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంటుంది అని గుర్తు చేశారు. కానీ, ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అయితే, ప్రపంచంలో నాల్గవ ఆర్థిక శక్తిగా భారత్ చేరుకుంది.. బీజేపీ, మోడీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.
Read Also: Viral Video: నదిలో చిక్కుకున్న టయోటా ఫార్చ్యూనర్.. నిమిషాల్లోనే లాగేసిన ఏనుగు.. వీడియో వైరల్
ఇక, పేదరికం అనుభవించిన వ్యక్తి మోడీ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోడీనీ కులం పేరుతో రాహుల్ గాంధీ దూషించారు.. ఇక, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే భయంకరమైన కలలు కంటున్నాడు అని ఎద్దేవా చేశారు. దేశంలో యువత ఉద్యోగాలు చేసే వారుగా కాకుండా.. ఉద్యోగాలు ఇచ్చే వారీగా తయారు చేస్తున్నారు మోడీ అని పేర్కొన్నారు. ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకుంది రాహుల్ గాంధీ కుటుంబం.. ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరుగుతుంటే.. మోడీనీ నాయకునిగా కీర్తిస్తుంటే గర్వకారణం కాదా అనేది ఖర్గే చెప్పాలని ఓబీసీ మోర్చ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
Read Also: Tirumala: తిరుమలకు రికార్డుస్థాయిలో భక్తులు.. హుండీ ఆదాయం..!
అయితే, ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులతో పాకిస్తాన్ కు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చెశారా అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో భారత ప్రజలు లేరు.. రేవంత్ రెడ్డి మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు అని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానం.. గతంలో అంజయ్యకు కూడా అవమానం జరిగింది.. ఢిల్లీకి వెళ్ళి కలవడంలో తప్పులేదు.. కానీ, ఇలా పడిగాపులు పడడం తెలంగాణ ప్రజలకు అవమానం అని పేర్కొన్నారు. ఇక, బీజేపీ వెనుక రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు చేయదు.. ఏదైనా సరే ముందు నుంచే చేస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.