అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో ఆమె పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించింది. జేపీ నడ్డా సలహాతో పోస్టును తొలగించినట్లు కంగనా రనౌత్ స్పష్టం చేసింది.
ప్రతిపక్షానికి భయపడే ప్రధాని మోడీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. బీహార్‌లోని మిథిలా యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించేందుకు దర్భాంగా జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది.
ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు..
సొంత పార్టీలో ఉంటూ.. కాంగ్రెస్‌పై విమర్శలు.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్న ఎంపీ శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటినట్లుగా హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీ వర్గాల అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశంలో మరో కొత్త సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది.
PM Modi Warns Pak: ఆదంపుర్‌లో భారత సైనికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఉగ్రవాదం అంతం చూస్తామంటూ భారత సైన్యం శపథం చేసింది.. మన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయని అన్నారు.
Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. చివరకు అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ ‘‘కాల్పుల విరమణ’’కు అంగీకరించింది. ఇదిలా ఉంటే, ఇంత నష్టపోయిన పాకిస్తాన్‌కి బుద్ధి రావడం లేదు. ఆ దేశ రాజకీయ నాయకులు ఇంకా యుద్ధ భాష మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా, పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఇషాక్ దార్ మరోసారి భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేశారు.
నిన్న ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోడీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ వైమానిక దళ సిబ్బందిని కలిసి వారి మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్…
Tiranga Yatra: భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం (మే 13) నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా…