కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన పక్కన నిలబడడంతో కొంత మందికి నిద్ర పట్టదని హస్తం పార్టీపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేరళలో విజింజం అంతర్జాతీయ ఓడరేవును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హాజరయ్యారు.
అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం రూ.1,07,002 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. రూ.49,040 కోట్ల రాజధాని పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు రూ.57,962 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజధాని అమరావతి రీలాంచ్‌లో పాల్గొనబోతున్నారు.. అయితే, ప్రధాని టూర్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. నిఘా నీడలోకి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లిపోయింది.. ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్గో సర్వీసులు నిలిపివేశారు ఎయిర్పోర్ట్ సిబ్బంది.. ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్ద ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు.. ఇక, ఎయిర్పోర్ట్ పిక్ అప్ కి వచ్చే వారికి పాస్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు…
రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్వాగతం పలికారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని #Amaravati నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది.. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది.
Eknath Shinde: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బలమైన దౌత్య నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రజలు ప్రస్తుతం సైనిక ప్రతిస్పందన ఆశిస్తున్నారు. "ఇది చివరి దాడి అవుతుందని మన ప్రజలు నమ్ముతున్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్‌ను తుడిచిపెడతారు" అని షిండే చెప్పారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌కి భయాందోళనలు పెరిగాయి. కాశ్మీర్ అందాలను చూస్తున్న అమాయకపు ప్రజలపై పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై, టెర్రరిజంపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రేపు అమరావతికి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయి. వీవీఐపీలు, వీఐపీలు నోవాటెల్ వైపు నుంచి బెంజిసర్కిల్ మీదుగా బందరు రోడ్డు వెళ్లి ప్రకాశం…
Pakistan: పాకిస్తాన్ మరింత దిగువ స్థాయికి చేరుకుంటోంది. సొంత దేశ పౌరుల్ని కూడా సరిహద్దు దాటి రానివ్వడం లేదు. ఇండియా నుంచి స్వదేశమైన పాకిస్తాన్ వెళ్తున్న పౌరుల్ని రానీవ్వడం లేదు. దీంతో అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పాకిస్తాన్ తన రీసీవింగ్ కౌంటర్లను మూసేసిందని భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. దీని ఫలితంగా చాలా మంది పాకిస్తాన్ జాతీయులు సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. Read Also: Pahalgam…
Jagga Reddy: రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రధాన అంశం కుల గణన.. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు.
ఏపీ రాజధాని అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమం రేపు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ టూర్ గంటా 25 నిమిషాలు పాటు ఉండనుంది. 58 వేల కోట్ల విలువైన పనుల శంఖుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రధాని మోడీ చేతుల మీద జరగనున్నాయి. అమరావతి పునఃనిర్మాణ పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, ఆర్టీసీ బస్సులను అధికారులు…