Neha Singh Rathore: వివాదాస్పద ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మరోసారి వివాదంలో నిలిచారు. ముఖ్యంగా, ఈమె బీజేపీ వ్యతిరేకతకు మారుపేరుగా ఉన్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ గురించి తన వీడియోలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నేహాసింగ్‌పై మళ్లీ కేసు నమోదైంది. సామాజిక సంస్థ సాధన ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సౌరభ్ మౌర్య దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా వారణాసిలోని సిగ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
PM Modi: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించబోతున్నారు. మే 26, 27 తేదీల్లో ఆయన గాంధీనగర్, కచ్, దాహోద్ సహా మూడు జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోడీ భుజ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. ఈ సభకు లక్ష మంది వరకు హాజరవుతారని తెలుస్తోంది. బహిరంగ సభ తర్వాత మోడీ ఆశాపుర ఆలయాన్ని సందర్శిస్తారు. Read Also: Theatres Closure :…
ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రధాని మోడీని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభినందించారు. శుక్రవారం రైజింగ్ నార్త్‌స్టెస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ముఖేష్ అంబానీ తన ప్రసంగాన్ని ఆపరేషన్ సిందూర్ విజయం సాధించినందుకు మోడీకి వందనం చేస్తూ ప్రారంభించారు.
మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. మోడీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బికనీర్‌లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మాట్లాడుతూ.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తానే పరిష్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.
Amrit Railway Stations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22 (గురువారం) నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 103 పునర్వికసిత రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. రూ.1,100 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణమైన ఈ రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) లో భాగంగా అభివృద్ధి చెంది ప్రయాణికులకు ఆధునిక వసతులతో కూడిన హబ్‌లుగా మారనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో ఉన్న ప్రధానమైన, చిన్న రైల్వే స్టేషన్లు…
యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
Jairam Ramesh: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి, ప్రజలను మభ్య పెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపణలు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ముఖాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తో జత చేసి 'వన్ అజెండా' అని రాసిన పోస్టర్‌ను కమలం పార్టీ సమాచార్ శాఖ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేశారు.