అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో అందరూ చనిపోతే.. ఒకే ఒక్కడు సజీవంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత తాపీగా బయటకు నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్‌లో కూర్చున్నాడు. అతడే మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించగా.. శుక్రవారం ప్రధాని మోడీ అతడి దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా పరామర్శించారు. అతని దగ్గర నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మెడికల్ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా పలకరించి ధైర్యం చెప్పారు.
గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక 15 మంది మెడికోలు కూడా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. మొత్తంగా 265 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (68) కూడా ఉన్నారు. లండన్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి పరిహారం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: PM Modi: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ
#WATCH | PM Modi visits Civil Hospital in Ahmedabad and meets the lone survivor of the Air India plane crash and other people injured in the accident pic.twitter.com/0OYwh90dNh
— ANI (@ANI) June 13, 2025